Karnataka Assembly Elections 2018: గుట్టలు గుట్టలుగా నకిలీ ఓటర్ కార్డులు

Oneindia Telugu 2018-05-09

Views 491

The flying squad of the Election Commission (EC) on Tuesday seized thousands of voter identity cards from a flat in Jalahalli, west Bengaluru, which falls under Rajarajeshwari Nagar (RR Nagar) assembly constituency.



కర్నాటక అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ నకిలీ ఓటరు కార్డులు కలకలం రేపాయి. జాలహళ్లిలోని ఓ అపార్ట్ మెంట్‌లో ఎన్నికల సంఘం మంగళవారం రాత్రి దాడులు చేసి 9,746 నకిలీ ఓటరు కార్డులను స్వాధీనం చేసుకుంది. నకిలీ ఓటరు కార్డుల వ్యవహారంపై బీజేపీ, కాంగ్రెస్ లు పరస్పరం విమర్శలు చేసుకుంటున్నాయి. గంగా చర్యలు తీసుకోవాలని మాజీ ప్రధాని, జేడీఎస్ అధినేత దేవెగౌడ ఎన్నికల సంఘాన్ని కోరారు.
కాగా, ఈ వ్యవహారంపై ఎన్నికల సంఘం అధికారులు దర్యాప్తు జరుపుతున్నారు. రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారి సంజీవ్‌కుమార్‌ అత్యవసర మీడియా సమావేశంలో ఈ వివరాలను వెల్లడించారు. నగరవ్యాప్తంగా ఒక్కో నియోజకవర్గంలో 6.03 శాతం కొత్త ఓటర్లు నమోదవగా... రాజరాజేశ్వరినగర్‌లో అది 10.3 శాతం ఉండడంతో అధికారులు శోధించారు. దాంతో బెంగళూరు నగరం రాజరాజేశ్వరీనగర్‌ పరిధి జాలహళ్లిలోని ఎస్‌ఎల్‌వి అపార్ట్‌మెంట్లో కొత్త ఓటర్ల నకిలీ దాఖలు కేంద్రం బయటపడింది.
అధికారుల నుంచి రహస్యంగా సేకరించిన కోడ్‌ సాయంతో కొత్త ఓటర్లను జాబితాలోకి ప్రవేశపెట్టి నకిలీ కార్డులూ సృష్టించారు. ఇలా రెండు ట్రంకుపెట్టెల్లో భద్రపరచిన 9,746 కార్డులను స్వాధీనం చేసుకున్నారు. మరో లక్ష ఓటర్ల గుర్తింపు కార్డులు తయారు చేయడానికి సిద్ధంగా ఉంచిన పత్రాలను పట్టుకున్నారు. వీటి తయారీకి వినియోగిస్తున్న ఐదు ల్యాప్‌ట్యాప్‌లు, ఓ ప్రింటర్‌ స్వాధీనం చేసుకున్నామని ఎన్నికల అధికారి చెప్పారు. ఇక్కడ ఎన్నికపై 24 గంటల్లో కీలక నిర్ణయం తీసుకుంటామని ప్రకటించారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS