Anushka In Rude Role అనుష్క కోసం వెయిటింగ్...

Filmibeat Telugu 2018-03-07

Views 1

Anushka may star in Telugu remake of Naachiyaar. Jyothika starrer Naachiyaar became hit movie in Tamil.

అనుష్కకు సౌత్ లో ఎలాంటి క్రేజ్ ఉందొ ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అనుష్క సోలో హీరోయిన్ గా నటించినా చాలు.. ఆ చిత్రాలు స్టార్ హీరోల చిత్రాల రేంజ్ లో ఆడుతాయి. అలాంటి క్రేజ్ ఉన్న కొద్ది మంది సౌత్ హీరోయిన్లలో అనుష్క కచ్చితంగా ముందు వరుసలో ఉంటుంది. గత దశాబ్ద కాలంగా అనుష్క సౌత్ లో క్రేజీ హీరోయిన్ గా కొనసాగుతోంది. చివరకు బాహుబలి వంటి బడా చిత్రంలో అనుష్కని ఏరి కోరి రాజమౌళి ఎంపిక చేసుకున్నాడంటే ఆమె క్రేజ్ అర్థం చేసుకోవచ్చు.

కేవలం గ్లామర్ పాత్రలు మాత్రమే కాదు అనుష్క తన నటనతో కూడా అబ్బురపరచగలదు. అరుంధతి, భాగమతి వంటి చిత్రాలలో సోలో హీరోయిన్ గా తిరుగులేని సత్తా చాటింది.
సాధారణంగా హీరోయిన్లు లావు కావడానికి ఇష్టపడరు. కానీ పాత్ర కోసం అనుష్క సైజు జీరో చిత్రంలో బొద్దుగా తయారై ఆశ్ఛర్యపరిచింది. ఆ చిత్రం తరువాత మళ్ళీ నాజూకు లుక్ లోకి వచ్చేసింది.

సౌత్ లో సోలో హీరోయిన్ గా సినిమా చేయాలంటే దర్శక నిర్మాతలకు మొదట గుర్తుకు వచ్చే హీరోయిన్ అనుష్కనే.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS