KTR Challenges Uttam Kumar Reddy

Oneindia Telugu 2018-02-06

Views 4.4K

Telangana Congress chief Uttam Kumar Reddy challenged Telangana IT Minister KT Rama Rao.

తెలంగాణ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు విసిరిన సవాల్‌ని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి స్వీకరించారు. 2019లో టీఆర్ఎస్ 100కు పైగా సీట్లు గెలుస్తుందని చెబుతున్నారని, అలా గెలిస్తే రాజకీయ సన్యాసానికి సిద్ధమని ప్రకటించారు. 2019లో తెరాస అధికారంలోకి రాకుంటే తాను రాజకీయ సన్యాసం తీసుకుంటానని, అదే కాంగ్రెస్ అధికారంలోకి రాకుంటే ఉత్తమ్ ఆ పని చేస్తారా అని కేటీఆర్ సవాల్ విసిరారు. వచ్చే ఎన్నికల్లో తమ పార్టీ గెలవడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఉత్తమ్ స్పందించారు.కేటీఆర్ సవాల్ స్వీకరిస్తున్నానని ఉత్తమ్ చెప్పారు. 2019లో టీఆర్ఎస్ అధికారంలోకి వస్తే తమ కుటుంబం అంతా రాజకీయాల్లో నుంచి తప్పుకుంటుందని చెప్పారు. మరి కాంగ్రెస్ గెలిస్తే కేసీఆర్, కేటీఆర్, కవిత, హరీష్ రావు.. ఇలా వారి కుటుంబం అంతా తప్పుకుంటుందా అని ప్రతిసవాల్ విసిరారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS