పవన్ కు కత్తి మహేశ్ సీరియస్ వార్నింగ్..!

Filmibeat Telugu 2018-01-06

Views 2.8K

Pawan Kalyan and Kathi Mahesh twitter war goes another level. Pawan retweets a Senior Jounalist tweet today morning. Immediately, Kathi Mahesh tweeted a message and warned him to becare ful.

పవర్‌స్టార్ పవన్ కల్యాణ్, క్రిటిక్ కత్తి మహేశ్ మధ్య చోటుచేసుకొంటున్న మాటల వివాదం కొత్త మలుపు తిరిగింది. శనివారం (జనవరి 6వ తేదీ) ఉదయమే ఆసక్తికరమైన మాటల యుద్దం చోటుచేసుకొన్నది. ట్విట్టర్‌లో పవన్ చేసిన ఓ పోస్ట్‌కు కత్తి మహేష్ ఘాటుగా స్పందించాడు. వారిమధ్య ఏం జరిగిందో మీరే ఓ సారి చూడండి..
ఉదయమే ఓ సీనియర్ జర్నలిస్టు నాకు గ్రీటింగ్స్ పంపారు. ఆయన సందేశంలో ఓ మంచి సందేశం ఉంది. దానిని చూసిన తర్వాత సమాజంతో పంచుకొవాలనుకొన్నాను. మీ అందరూ ఈ రోజు సంతోషంతో ఉండాలని కోరుకొంటున్నాను అని పవన్ ఓ ట్వీట్ చేశారు.
ఇంతకీ సీనియర్ జర్నలిస్టు పంపిన ట్వీట్ ఏమిటంటే.. వ్యక్తిత్వంలో నిన్ను ఓడించడం చేతకాని వాళ్లు.. నీ కులం, ధనం, వర్ణం గురించి మాట్లాడుతారు అని ట్వీట్ ఛేశారు.
అంతేకాకుండా.. పవన్ మరో ట్వీట్‌ కూడా చేశారు. సమాజాన్ని కులాల వారీగా విభజించడం, కుల రాజకీయాలు, పవర్ పాలిటిక్స్ లాంటివి వాస్తవంగా ఆందోళన కలిగిస్తున్నాయి. అవి ఆర్థికపరంగా దెబ్బ తీయడమే కాకుండా సమాజానికి హానీ, కీడు తలపెడుతాయి. ఈ జాడ్యం సమాజంలో పిచ్చిగా మారింది అని పవన్ ట్వీట్ చేశారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS