నాగ్ సినిమాకు క్రేజీ టైటిల్

Filmibeat Telugu 2017-12-05

Views 1.5K

After 28 years, Nagarjuna, Ram Gopal Varma movie has repeated. Varma and Naga's new police cop movie which started on November 20 at Annapurna Studios.

టాలీవుడ్‌లో ట్రెండ్ సెట్టర్‌గా నిలిచిన చిత్రం శివ. అక్కినేని నాగార్జున, రాంగోపాల్ వర్మ కాంబినేషన్‌లో వచ్చిన సంచనల విజయం సాధించింది. అలాంటి చిత్రం రూపొందిన 28 ఏళ్ల తర్వాత మళ్లీ నాగ్, వర్మ కాంబినేషన్ రీపీట్ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి ఎలాంటి పేరు పెడుతారో అనే ఓ సందేహం ఫ్యాన్స్‌ను వెంటాడుతున్నది. ఈ నేపథ్యంలో ఆసక్తికరమైన టైటిల్స్ వెలుగులోకి వచ్చాయి.
వర్మ రూపొందించబోయే సినిమాలో నాగార్జున పోలీస్ అధికారిగా నటించనున్నాడనేది తాజా సమాచారం. పోలీస్ కథ అంటే అండర్ కరెంట్‌గా మాఫియా స్టోరి కంపల్సరీ. ఇప్పటికే విడుదలైన ఫస్ట్‌లుక్‌లలో తుపాకులు, పిస్టల్స్‌తో అదరగొట్టేశాడు. ఈ సినిమా కథకు సరిపోయే విధంగా విభిన్నమై టైటిల్‌ను పరిశీలీస్తున్నట్టు తెలుస్తున్నది.
కథ డిమాండ్ మేరకు, నాగ్ ఇమేజ్‌ను దృష్టిలో పెట్టుకొని ఈ చిత్రానికి గన్‌, సిస్టమ్‌ అనే టైటిళ్లను పరిశీలిస్తున్నారట. అయితే టైటిల్‌ తెలుగులో ఉంటుందా లేదా ఇంగ్లీష్‌లో ఉంటుందా అనే విషయంపై క్లారిటీ లేదు. అర్జున్‌రెడ్డి మాదిరిగా ఇంగ్లీష్‌లోనే పెట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తున్నది.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS